NewsWaves.news

అప్పుడు సూపర్ స్టార్ తో… ఇప్పుడు సూపర్ స్టార్ తోనే…

విజయశాంతి…ఒకప్పుడు అందరు టాప్ హీరోలతో నటించడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో చేసి లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్. ఆ తర్వాతి కాలంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.తర్వాత ఆమె పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతగా రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు విజయశాంతి.అయితే తాజాగా విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే.దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి తిరిగి సినిమాల్లో నటించనున్నారు.

అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. విజయశాంతి తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ సినిమాతోనే. కృష్ణ హీరోగా నటించిన కిలాడీ కృష్ణ చిత్రంతో విజయశాంతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇప్పుడు మళ్లీ కృష్ణ కుమారుడైన మహేష్ బాబు చిత్రంతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇక విజయశాంతిని తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి