NewsWaves.news

సాయంత్రం 6.30 నిముషాలకు కేంద్ర కాబినెట్ తో ప్రధాని కీలక భేటీ…

భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేడు సాయంత్రం 6.30 నిముషాలకు భారత ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ కాబినెట్ భేటీలో అనేక ప్రధాన అంశాలను చర్చించనున్నారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ ను విడిపించడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై అలాగే భారత్, పాక్ యుద్ధ పరిణామాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.పాకిస్తాన్ కి ధీటుగా జవాబు చెప్పడంపైన కూడా ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.కాగా తాజా పరిస్థితులను సమీక్షించడానికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Related Articles