NewsWaves.news

పాక్ పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో స్పందించిన అసద్.. ఇప్పటికైనా పాకిస్థాన్ ప్రధాని అమాయకత్వపు ముసుగు తొలగించాలని అన్నారు. పాకిస్థాన్… భారత ముస్లింల గురించి ఆలోచించవద్దని, 1947 నుండి భారత్‌ను ఇక్కడి ముస్లింలు తమ సొంత దేశంగా భావిస్తున్నారని అసద్ స్పష్టం చేసారు.

భారతదేశంలో గుడి గంటలు మోగనివ్వం అని పాక్‌కు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. భారతదేశంలో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్‌.. దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయని, ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారని.. అయితే దీన్ని పాక్‌ ఓర్వలేకపోతోందని అసద్ ఫైర్ అయ్యారు. జైషే మహమ్మద్‌ సంస్థను జై షే సైతాన్‌గా అభివర్ణించిన అసద్.. ఏ ముస్లిం కూడా ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకోడని… పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్‌ఐ కలిసే పుల్వామా ఉగ్రదాడిని జరిపాయని అసద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related Articles