NewsWaves.news

కాళ్లు కడిగిన ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు ఈ గౌరవం దక్కింది. గత కుంభమేళా ఉత్సవాలలో కంటే ఈసారి జరుపుతున్న ఉత్సవాలలో స్వచ్ఛత ఉట్టిపడేలా పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. నేడు కుంభమేళ ఉత్సవాలకు హాజరైన మోడీ అక్కడ పవిత్ర గంగానదిలో స్నానమాచరించారు. అనంతరం సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఉత్సవాల్లో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు గుర్తింపుగా వారి పాదాలను కడిగారు ప్రధాని మోదీ.

Related Articles