NewsWaves.news

అట్టుడుకుతున్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ అట్టుడుకుతోంది. నాన్‌లోకల్ కుటుంబాల‌కు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు అందించాల‌ని అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నియ‌మించిన ఒక క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యం తెలిసిన నాటి నుంచి అక్క‌డి ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఈ కాల్పుల్లో ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడు. అయితే ఆ వ్య‌క్తి మ‌ర‌ణంతో ప‌రిస్థితి మరింత‌గా చేజారింది. 50 కార్లుకు నిప్పు అంటించిన నిర‌స‌న‌కారులు..100 పైగా వాహ‌నాల‌కు ధ్వంసం చేశారు.

అక్క‌డితో ఆగని నిర‌స‌కారులు అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ బంగ్లాను తగులబెట్టారు. దీంతో చౌనా మెయిన్ తన మకాంను నామ్‌సాయ్ జిల్లాకు మార్చారు. నామ్ సాయ్ జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎస్పీ ర్యాంకు అధికారి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటానగర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ముఖ్యమంత్రి ఫెమా ఖండూతో మాట్లాడి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంయమనంతో ఉండాలని రాజ్‌నాథ్ కోరారు.

Related Articles