NewsWaves.news

ఉగ్రవాదుల దాడి లో ఎమ్మెల్యే తో సహా పది మంది మృతి.

ఉగ్రవాదం మరోసారి పంజా విసిరింది.అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటనలో ఒక ఎమ్మెల్యే తో పాటు గా మరో పది మంది చనిపోయారు. ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) అనుమానిత ఉగ్రవాదులు అరుణాచల్‌ ప్రదేశ్‌లో కలకలం సృష్టించారు. ఓ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిని కాల్చి చంపారు. వారిలో ఇద్దరు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. తిరాప్‌ జిల్లాలోని బొగాపాని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖోన్సా పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్‌పీపీ తరఫున మరోసారి పోటీ చేసిన తిరోంగ్‌ అబో.. మంగళవారం అసోం నుంచి తన నియోజక వర్గంలోని ఓ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి జరిపారు.ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఎనిమిది మంది వ్యక్తులు, ఇద్దరు భద్రతా బలగాలు ఉన్నారని, బోగాపనీ గ్రామంలోకి వారి వారు చేరుకోగానే వారిపైకి అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆ ప్రాంత డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ పీఎన్‌ తుంగోన్‌ తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి