NewsWaves.news

ఆర్టిక‌ల్ 35- ఎ ర‌ద్దు పిటీషన్‌పై 26-28 మ‌ధ్య‌లో సుప్రీం హియ‌రింగ్‌ వాయిదా

ఆర్టిక‌ల్ 35-ఎ ర‌ద్దు చేయాల‌నే పిటీష‌న్‌పై సర్వోన్న‌త న్యాయ‌స్థానం వాద‌న‌లు విన‌నుంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం జ‌మ్మూ క‌శ్మీర్‌లో ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. జ‌మ్మూ క‌శ్మీర్ కు ప్రత్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 35-ఎ ర‌ద్దు చేయాలంటూ పిటీష‌న్లు ధాఖ‌ల‌వ‌డంతో సుప్రీం కోర్టు ఈ వాద‌న‌లు విన‌నుంది. పుల్వామా దాడి త‌ర్వాత ఇప్ప‌టికే క‌శ్మీర్‌లో ఘ‌ర్ష‌ణ‌ వాతావ‌ర‌ణం నెలకోన‌గా.. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ప‌టిష్ఠ భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇప్ప‌టికే 100 కంపెనీ బ‌ల‌గాలను క‌శ్మీర్‌లో మోహ‌రించారు.

క‌శ్మీర్‌లో తాజా ప‌రిస్థితి ఇది

*అశాంతిని క‌లిగించే అవ‌కాశం ఉన్న వేర్పాటువాదుల‌ను ముందే అదుపులోకి తీసుకున్నారు.

*వీరిలో జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ సైతం ఉన్నారు.

*ఆర్టికల్ 35 ఎపై జమ్మూ కశ్మీర్‌లో పొలిటిక‌ల్ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి.

*బీజేపీ ఈ ఆర్టికల్‌ను రద్దుకు మద్దతు తెలపగా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Related Articles