NewsWaves.news

ఎమ్మెల్సీ పదవికి ఏపీ మంత్రి రాజీనామా

ఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావించిన సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ఈ రోజు సాయంత్రం తన రాజీనామా లేఖని అసెంబ్లీ కార్యదర్శిని అందజేశారు. సోమిరెడ్డి పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ మూడు సంవత్సరాల ముందుగానే ఆయన పదవికి రాజీనామా చేసారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలనే ఆసక్తితోనే సోమిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2016 సంవత్సరంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Related Articles