NewsWaves.news

జంప్ జిలానీలు!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ మైత్రి, విరోధం విచిత్రంగా క్షణంలో రంగులు మార్చుకుంటాయి.  నిన్న మొన్నటిదాకా కస్సుబస్సుమని నానా దుర్భాషలాడుకున్న నేతలు నేడు హఠాత్తుగా కావలసినవాళ్ళయిపోతారు. కలివిడిగా ఉన్న నాయకులు ఉన్నట్టుండి విడిపోయి, పార్టీని విడిచిపెట్టి విమర్శలు గుప్పిస్తారు.  ఎవరు ఎప్పుడు ఏపార్టీలో ఉంటారో తెలియని స్థితిలో,  పార్టీ ఫిరాయింపులు అధినే`తల’కు శిరోభారం తెప్పిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జంప్ జిలానీలు ఎవరో అంతుచిక్కడం లేదు. శీతాకాలం వెళ్లిపోయి, వేసవి వచ్చేసింది. రాజకీయ నేతలకు మాత్రం ఎన్నికల జ్వరం చలి, వణుకు పుట్టిస్తోంది.


అవంతి శ్రీనివాసరావు

 తాజాగా,  ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  చంద్రబాబు పాలన, టీడీపీ తీరుపట్ల  ఆయన అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో  చేరారు.

Amanchi Krishna Mohan-Chadrababu news waves

ఆమంచి కృష్ణమోహన్‌

  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌  పార్టీకి రాజీనామా చేశారు.  తన నియోజకవర్గంలో పార్టీకి, ప్రభుత్వానికి  సంబంధంలేని వారి ప్రమేయం ఎక్కవైందనేది ఆయన విమర్శ.  2014లో ఎన్నికల్లో చీరాలనుంచి ఇండిపెండెంటుగా  గెలిచిన   కృష్ణమోహన్  ఆ తర్వాత టీడీపీలో చేరారు.  ఇప్పుడున్న పరిస్థితులలో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమంచి పార్టీని వీడిపోవడం  ప్రకాశం జిల్లాలో టీడీపీకి  గట్టి దెబ్బే అవుతుంది.  

శంభంగి చిన్న అప్ప‌ల‌నాయుడు

       విశాఖజిల్లా  పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్‌ టీడీపీ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చిన అప్పలనాయుడు పార్టీకి బై బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో  పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ఆయన ఇప్పటివరకు  టీడీపీ అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. పెందుర్తిలో క్షేత్రస్థాయిలో పేద, బడుగు బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న శరగడం చేరికతో  వైకాపా శ్రేణులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. అప్పలనాయుడుతోపాటు మరికొందరు వైకాపాలోకి వస్తారని వైకాపా నేతల ధీమా.మరోవైపు విజయనగరం జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిశోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇటాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.


ఏపీలో ఎన్నికలు మరీ రసకందాయంలో సాగనున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, వైకాపా, జనసేన తలపడుతున్నాయి. చతుర్ముఖ పోటీ అనివార్యం. నే`తలరాత’లు ఎలా  ఉంటాయో చూడాలి.

 ఈవలసల సలసల  వేడి దాదాపు అన్ని ప్రాంతాలలో, అన్ని పార్టీలలోను ఉంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధుల ఎంపికలో తలమునకలై ఉన్న అధినేతలకు, అగ్రనేతలకు ఇది మింగుడుపడని వ్యవహారమైంది.  ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు, దేశమంతటా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.   తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ మహాకూటమిగా జతకట్టి పోటీచేశాయి. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. సీనియర్ దిగ్గజాలు జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వారు కూడా పరాజయంపాలై దిగాలు పడే పరిస్ధితి తప్పలేదు. వైకాపా తటస్థంగా ఉంది. ఒక్క అభ్యర్ధినీ పోటీకి నిలబెట్టలేదు.   ఏపీలో అసెంబ్లీ ఎన్నికలలో,  రెండు తెలుగు రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలలో పార్టీల వ్యూహం ఏమిటో మరి!

 అటు జాతీయ రాజకీయాలలోను పెను మార్పులు గోచరిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పూర్తిగా ఉత్తర ప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు. నోటిఫికేషన్ రాకుండానే పర్యటన, ప్రచారం మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా  విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ తరుణంలో  సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌  పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల  వర్షం  కురిపించి అందరినీ ఆశ్చర్చంలో ముంచెత్తారు. మోడీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నాని,  మోడీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారంటూ  ఆకాశానికెత్తారు.  

 మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో అఖిలేశ్‌ జత కట్టారు. మోడీకి వ్యతిరేకంగా ఇటీవల కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్‌ మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  


సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు పొడసూపటినప్పటినుంచి అఖిలేశ్‌, ములాయం మధ్య దూరం పెరిగిన విషయం తెలియనది కాదు.

  ఈ తరుణంలో పార్లమెంటులో మోడీకి అనుకూలంగా ములాయం చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు పొడసూపటినప్పటినుంచి అఖిలేశ్‌, ములాయం మధ్య దూరం పెరిగిన విషయం తెలియనది కాదు.

 ఇలా…ఫిరాయింపులు, వలసలు, కూడికలు, తీసివేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల వైఖరి, వెన్నుపోట్లు, ఆటుపోట్లు ఎవరికి ఎలా అనుకూలంగా మారతాయో, జంప్ జిలానీల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో …రాజకీయ విశ్లేషకులకూ అంతు`చిక్కని’ మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది.

Related Articles