NewsWaves.news

జ‌వాన్ల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వం రూ.5ల‌క్ష‌ల స‌హాయం

పుల్వామాలో ఉగ్ర‌వాదుల దాడి అత్యంత హేయ‌మైన‌ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల‌కు  ఒక్కో కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల స‌హాయం అందిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. జ‌వాన్ల కుటుంబ స‌భ్యుల‌కు ఏపీ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేసేందుకు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే  చ‌ర్య‌ల‌కు తాము మ‌ద్ద‌తిస్తామ‌న్నారు. ఉగ్ర‌వాద నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉమ్మ‌డిగా ప‌టిష్ఠ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. 

Related Articles