NewsWaves.news

అంత‌ర్వేది బ్రహ్మోత్స‌వాలకు భ‌క్తుల వెల్లువ‌

తూర్పుగోదావరి జిల్లాలో పవిత్ర గోదావరీ తీరాన అంతర్వేది ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో జ‌రుగుతున్న బ్ర‌హ్మోత్స‌వాల‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. గోదావ‌రి న‌దిలో స్నానం చేసి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి వివిధ జిల్లా నుంచి ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ద‌క్షిణ కాశీగా పేరుపొందిన ఈ అంత‌ర్వేదిలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 12న మొద‌లైన అంత‌ర్వేది బ్ర‌హ్మోత్స‌వాలు ఈ నెల 19 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. బ్ర‌హ్మోత్సవాల‌లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Related Articles