NewsWaves.news

ఒడిశాకు మ‌రో 381 కోట్లు : మోడీ

ఫోని తుపాను ధాటికి అతలాకుతల‌మైన ఒడిశాను అన్నివిధాలా ఆదుకుంటామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చెప్పారు. ఇంత‌కుముందు ప్ర‌క‌టించిన వెయ్యికోట్ల రూపాయ‌ల త‌క్ష‌ణ సాయం కాకుండా మ‌రో 381 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఒడిశా రాష్ట్రంలో తుపాను వ‌ల్ల 32మందికి పైగా మృతిచెందారు. వేలాది ఎక‌రాల‌లో పంట న‌ష్టం వాటిల్లింది. భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

మంచినీటి స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం వాటిల్లింది. రాష్ట్రంలో 5వేల తాత్కాలిక పున‌రావాస కేంద్రాల‌కు దాదాపు ప‌దిల‌క్ష‌ల‌మందిని త‌ర‌లించారు. ఒడిశాలో తుపాను ధాటికి న‌ష్టం వాటిల్లిన ప్రాంతాల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను భీభ‌త్సం, న‌ష్టం వివ‌రాల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.
కాగా తుపాను ధాటికి కకావికలమైన ఒడిశాకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. తుపాను బాధితులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 కోట్లు సాయం అంద‌చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఫొని తుపానుతో ఒడిశా తీవ్రంగా నష్టపోయింద‌ని, దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఒడిశాకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞ‌ప్తిచేశారు. తుపాను బాధితులకు మంచినీరు, ఆహారం, పాలు, కూరగాయలు సరఫరా చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలని ఆయ‌న కోరారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి