NewsWaves.news

మ‌హేష్ బాబుతో ఎఫ్2 ద‌ర్శ‌కుడి సినిమా?

కామెడీ, కామెడీ యాక్ష‌న్ సినిమాలు తెర‌కెక్కించి మంచి విజ‌యాలు కైవ‌సం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వ‌రుస‌గా ఇంగ్లీష్ టైటిల్స్‌ను ఎంచుకుని హిట్ కొడుతున్న అనిల్‌..ఇటీవలే వాట్సాప్ అనే టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేసుకున్నాడట‌.

ఫిలింన‌గ‌ర్ వార్తల ప్ర‌కారం అనిల్ ఈ టైటిల్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకోసం ఎంచుకున్నాడ‌ట‌. అనిల్ రావిపూడి-మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాను అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నార‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు మ‌రి.

Related Articles