NewsWaves.news

భార్య‌కోస‌మే అంత పెద్ద పెద్ద సిక్స్‌లు కొట్టేది : ర‌స్సెల్‌

కోల్ క‌త్తా నైట్ రైడ‌ర్స్ స్టార్ హిట్ట‌ర్ ర‌స్సెస్ అంత‌లా రెచ్చిపోయి ఆడ‌టానికి కార‌ణం ఏంటో తెలుసా ? అత‌ని భార్య‌. త‌న భార్య‌ను ఆక‌ట్టుకోవ‌డానికే ఈ హార్డ్ హిట్ట‌ర్ భారీ సిక్సులు బాదేస్తుంటాడ‌ట‌. అభిమానులను ఆనందంగా ఉంచ‌డానికి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడ‌ని.. ప్రతి మ్యాచ్‌లో మంచి ప్రదర్శనతో త‌న భార్యను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తాని తెలిపిన ర‌స్సెల్‌.. త‌న భార్య‌ త‌నకు దేవ‌త అని తెలిపాడు.

Andrew Russel and Wife

తన బ్యాటింగ్‌ ఎలా ఉందని రసెల్‌ అడగ్గా.. ‘‘చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇలాంటి ప్రదర్శనే చేస్తావని ఊహించా. నువ్వు భారీ సిక్సర్లు కొట్టినపుడల్లా గుండె చేతుల్లోకి వచ్చేసింది అంటే నమ్ము’’ అని జేసిమ్‌ సమాధానమిచ్చింది. కొంతకాలం పాటు సహజీవనం చేసిన రసెల్‌, జేసిమ్‌ 2016లో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో పుట్టిన జాసిమ్‌ ప్రస్తుతం జమైకా మోడల్‌గా రాణిస్తోంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి