NewsWaves.news

పెరుగు అనుకున్నాడు…సగం డబ్బా పెయింట్ తిన్నాడు…

90 సంవత్సరాలు ఉన్న ఒక తాత పెరుగు అనుకొని పెయింట్ తినేసాడు. అంతేకాదు చాలా టేస్టీగా ఉందంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే..న్యూయార్క్ కి చెందిన బాబీ అనే 90 సంవత్సరాల తాత ఇంటికి రంగు వేయడం కోసం తీసుకువచ్చిన పెయింట్ డబ్బా ని చూసాడు. అది తన కోసం తెచ్చిన పెరుగేనేమో అనుకొని మూత తీసేసి సగానికిపైగా పెయింట్ తినేశాడు.

ఈ విషయాన్ని చూసిన ఆయన మనవరాలు అలెక్స్ స్టెయిన్ గట్టిగా అరిచింది. అలా అరిచిన మనవరాలు వైపు చూసిన తాత..ఈ పెరుగు మింట్ ఫ్లేవర్ లో ఉందని, చాలా రుచిగా కూడా ఉందని మనవరాలికి చెప్పాడు. దాంతో అది పెరుగు కాదని, పెయింట్ అని ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో కూడా వెల్లడించింది. కాగా ఈ పెయింట్ తిన్నందుకు బాబి ఫీల్ కాలేదు సరికదా ఎలాంటి అనారోగ్యానికి, ఇబ్బందికి కూడా గురి కాలేదు అని ట్విట్టర్లో తెలిపింది.

అంతేకాదు పెయింట్ పెదాలకి అంటుకొని ఉన్న బాబి ఫోటో ని కూడా షేర్ చేసింది. ఇక తాతగారైన బాబీ కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయంపై ఒక పోస్ట్ చేశాడు.తాను పెయింట్ తిన్నాడని, నిజానికి పెరుగు కంటే పెయింట్ చాలా రుచిగా ఉందని, అలా తిన్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపము లేదని ఆ పోస్టులో తెలపడం విశేషం.

Related Articles