NewsWaves.news

మెగా హీరో వాలెంటైన్స్ డే ట్వీట్… బిగ్ బీ కాంప్లిమెంట్…

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వాలెంటైన్స్ డే రోజున తాను చేసిన పోస్ట్ తో అందరి అభినందనలని పొందుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా సింగిల్ గా ఉన్న వాళ్ళ మందరం సంబరాలు చేసుకుందామని సరదాగా ట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్ దానితో పాటు భావోద్వేగంతో కూడిన మరొక పోస్ట్ కూడా చేశాడు.భారత ఆర్మీ జవాన్లకు వాలెంటైన్స్ డే విషెస్ ని చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.”ఇలాంటి స్పెషల్ డే రోజు జంటగా లేని వారు ఎవరైనా ఏకాకిని అని బాధపడుతూ ఉంటారు.

దానికి ప్రేమ దొరక్క పోవడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న ఆర్మీ సైనికులు ఎప్పటికీ సింగిల్ గానే ఉంటారు. కుటుంబం, బంధువులు,స్నేహితులు ఇలా అందరికీ వారు దూరంగా ఉంటారు. దేశాన్ని కాపాడడం కోసం ఎలాంటి పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాంటి జవాన్లు ఎప్పటికీ ఒంటరి వాళ్లు కాదు.మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.

మీ సేవలను ఎన్నటికీ మరచి పోము. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కించకుండా పోరాటం చేస్తున్న మీకు దేశ ప్రజల ప్రేమ ఎప్పుడూ అండగా ఉంటుంది.” అంటూ ట్వీట్ చేశాడు. మెగా హీరో చేసిన ఈ ట్వీట్ కి బిగ్ బి కూడా రియాక్ట్ అయ్యారు. “సెల్యూట్” అంటూ రీట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles