NewsWaves.news

పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

నిన్న పాకిస్తాన్ లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేసిన త‌ర్వాత అమెరికా స్పందించింది. పాక్‌లో ఉన్న ఉగ్ర‌వాద శిక్ష‌ణా కేంద్రాల‌పై, స్థావ‌రాల‌పై ఆ దేశ ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో తెలిపారు. గ‌తంలో జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ త‌రువాత ఆమెరికా పాక్ కు ఎలాంటి సైనిక చ‌ర్య‌ల‌కు దిగ‌వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చింది. అదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదంపై పాక్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించే తీరును మార్చుకోవాల‌ని ఇమ్రాన్ ఖాన్‌కు సూచ‌న‌లు ఇచ్చింది.

తాజా ప‌రిణామాల‌పై పాంపియో ఒక ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో మాట్లాడ‌న‌ని.. భార‌త్ చేసిన దాడి కేవ‌లం ర‌క్ష‌ణ ప‌ర‌మైన చర్య‌లో భాగ‌మేన‌ని ఆమె చెప్పార‌ని…శాంతి కొర‌కు ఇరు దేశాలు ప్ర‌య‌త్నించాల‌ని సూచించానన్నారు. అదే స‌మ‌యంలో పాక్ విదేశాంగ మంత్రి మ‌హ‌మూద్ ఖురేషీతో మాట్లాడిన‌ట్టు తెలిపిన పాంపియో…ఉగ్ర‌వాద శిబిరాల‌ను ధ్వంసం చేయ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపార‌న్నారు.


Related Articles