NewsWaves.news

ఉగ్ర‌వాదం అంతానికి భార‌త్ కు అమెరికా మద్ద‌తు

కాశ్మీర్ లో ఉగ్ర‌వాదుల ఘాతుకంపై  అమెరికా మండిప‌డింది. దేశంలో గంద‌ర‌గోళం సృష్టించి, హింస‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మే ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తంచేసింది.  జమ్మూకాశ్మీర్ , పుల్వామాలో ఉగ్ర‌వాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం విదిత‌మే. ముష్కరుల విషయంలో పాక్‌ తీరు మారాల‌ని అమెరికా హెచ్చరించింది. ..ఉగ్రవాదులకు పాక్ మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

ముష్కరులకు మద్దతు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని  పాక్‌ను హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో  భారత్‌కు అమెరికా పూర్తి మద్దతిస్తుందని తెలిపింది. ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.  పుల్వామాలో ఉగ్రవాదుల‌దాడిని అమెరికాతో సహా ప‌లు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి.

Related Articles