NewsWaves.news

టిడిపికి మ‌రో షాక్ : వైకాపాలో తెదెపా ఎంపి

తెలుగుదేశం పార్టీ నుంచి నేత‌లు జంప్ అవుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విష‌యం తెలిసింది. వ‌లస‌లు పెరుగుతోండ‌టం తెదెపా శ్రేణుల‌ను టెన్ష‌న్ పెడుతోంటే వైకాపా నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

మ‌రోవైపు జ‌గ‌న్ కూడా వైకాపాలో చేరాలి అనుకోనే నేత‌ల‌కు డెడ్‌లైన్ పెట్టాడు. దీంతో ఇత‌ర పార్టీ నేత‌లు పార్టీ మారే విష‌యంలో వేగం పెంచారు.

తాజాగా ఈరోజు అమ‌లాపురం పార్ల‌మెంట్ స‌భ్యుడు పి. ర‌వీంద్ర‌బాబు వైకాపాలో చేరారు. టిడిపిని వీడి వైకాపాలో చేరినందుకు త‌న‌కు పుట్టింటికి వ‌చ్చినంత ఆనందంగా ఉంద‌ని తెలిపాడు ర‌వీంద్ర‌బాబు. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని చంద్ర‌బాబు నీరుగార్చార‌ని..ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్ర‌బాబు వెంట‌నే విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ అయ్యార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌నికిరార‌ని.. ఆయ‌న వ‌ల్ల రాష్ట్రానికి ఏ మాత్రం మంచి జ‌ర‌గ‌ద‌న్నారు.

Related Articles