NewsWaves.news

అసలు ఈ జెనీవా ఒప్పందం అంటే ఏమిటి?

భారత పైలెట్ అభినందన్ పాక్ ఆర్మీకి పట్టుబడిన నేపథ్యంలో అసలు జెనీవా ఒప్పందం అంటే ఏమిటి? అందులో ఉన్న విషయాలు ఏంటి? అనేది భారత్,పాక్ ప్రజలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ గూగుల్ లో వెతుకుతున్నారు.దానితో జెనీవా ఒప్పందం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.అసలు ఈ జెనీవా ఒప్పందం, అందులో ఉన్న అంశాలు ఏమిటో చూద్దాం.యుద్ధంలో లేదా సైనికులు సరిహద్దులు దాటినప్పుడు బందీ కాబడిన సైనికులు, ప్రజలతో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని తెలిపేదే జెనీవా ఒప్పందం.

జెనీవా ఒప్పందాన్ని 1929లో రూపొందించారు.యుద్ధ ఖైదీల హక్కులను ఈ జెనీవా ఒప్పందం లో పొందుపరచడం జరిగింది. రెండో ప్రపంచ యుద్దం జరిగిన తర్వాత 1949 లో ఈ ఒప్పందంలో కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంలో మొత్తం నాలుగు అంశాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను చేసింది.1949 లో చేసిన ప్రధానమైన నాలుగు సవరణలలో మొదటిది.. సైనికులు అనారోగ్యంతో లేదా గాయాలతో పట్టు పడితే వారిని వేధించకూడదు.

వారితో మానవత్వంతో వ్యవహరించాలి.అలాగే రంగు, లింగ భేదం,మతం, ప్రాంతం,ధనం వంటివి ఆధారంగా చేసుకుని వేధించకూడదు. హింసించడం లేదా ఉరి తీయడం వంటివి చేయకూడదు. బందీగా ఉన్న వారికి గాయాలు అయినా లేదా అనారోగ్యంతో ఉన్నా వెంటనే వైద్య సేవలు అందించాలి. ఇక రెండవ సవరణలో నావిక, వైమానిక దళాలను కూడా జెనీవా ఒప్పందంలో చేర్చారు. మూడవ సవరణ ప్రకారం బందీ కాబడిన సైనికుల ర్యాంకులు అలాగే సీరియల్ నెంబర్లను మాత్రమే తీసుకోవాలి.

అంతే కానీ వారి దేశం యొక్క రహస్యాలను తెలుసుకునేందుకు వారిని హింసించకూడదు.నాలుగవ సవరణ ప్రకారం పట్టుబడిన సైనికుల రక్షణ కూడా ఆ దేశం బాధ్యతే.జవాన్లను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటే వారిని తిరిగి స్వదేశానికి అప్పగించాలి.ఇవి జెనీవా ఒప్పందంలో ఉన్న ప్రధాన అంశాలు.

Related Articles