NewsWaves.news

కృత్రిమ కాలితో డ్యాన్స్ చేస్తున్న పిల్లాడు.. వీడియో వైర‌ల్‌

ఆఫ్గనిస్థాన్ కు చెందిన ఓ బూడతడు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఓ ల్యాండ్ మైన్ పేలుడులో ఒక కాలు పొగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ కు ఇటీవల కృత్రిమ కాలు అమర్చారు వైద్యులు.

Afghan Boy Danced With Artificial Leg

మొదట కృత్రిమ కాలిలో నడవడానికే ఇబ్బంది పడ్డ అతడు ఇప్పుడు ఏంచక్కా తన కాలిపై తాను నడవగలుగుతున్నాడు. తాజాగా అదే కాలితో నృత్యం చేస్తుండగా ఒకరు వీడియో తీశారు. మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే 2019 సందర్భంగా రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 77వేలకు పైగా వ్యూస్, 2,700 లైక్స్, 970 పైగా రిట్వీట్స్ వచ్చాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి