NewsWaves.news

సంగీత నాట్యక‌ళా గురుకులంలో అడ్మిష‌న్లు

శ్రీ‌కాకుళం జిల్లాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న సంగీత నాట్య క‌ళా గురుకులంలో వివిద కోర్సుల‌లో చేరేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. కూచిపూడి నృత్యం, క‌ర్ణాట‌క సంగీతం, వ‌యోలిన్ ల‌లో కోర్సులు నిర్వ‌హిస్తున్నారు.

రెండేళ్ళ కాల‌ప‌రిమితి తో నాట్య‌, సంగీత విశార‌ద స‌ర్టిఫికెట్ కోర్సు, నాట్య, సంగీత కౌముదిలో డిప్ల‌మో కోర్సు, నాట్య‌, సంగీత పారిజాత ల‌లో పీజీ కోర్సు నిర్వ‌హిస్తోంది. ఈ కోర్సుల‌లో చేర‌ద‌ల‌చిన‌వారు ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ పాసై ఉండాలి.

సంగీతంపై, నాట్యంపై క‌నీస ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి. కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో స‌ర్టిఫికెట్ కోర్సుల‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా కోర్సుల‌లో ప్రవేశానికి ఎంపిక చేస్తారు. http://sampradayam.com ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తులు చేర‌వ‌ల‌సిన ఆఖ‌రి తేదీ..30-4-2019.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి