NewsWaves.news

సుప్రియ‌తో పెళ్లి పుకారుపై అడ‌వి శేష్ రిప్లై

హీరో అడ‌వి శేష్, నాగార్జున మేన‌కోడలు వివాహంపై ఎన్నో పుకార్లు వ‌స్తున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఆ నోటా ఈ నోటా ఈ పుకారు గురించి విన్న‌ అడ‌వి శేష్ దీనిపై స్పందించాడు. 20 ఏళ్ల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యార్ల‌గడ్డ సుప్రియ తాజాగా గూఢ‌చారి మూవీలో కీల‌క పాత్ర పోషించారు. నాగార్జున మేన‌కోడ‌లు అయిన ఆమె అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకుంటున్నారు. సుప్రియా- అడ‌వి శేష్ న‌టించింది ఒక్క సినిమానే అయినా…వారి వివాహం గురించి పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో అడ‌వి శేష్ రిప్లై ఇవ్వాల్సి వ‌చ్చింది.

Related Articles