NewsWaves.news

శత్రువుల నుండి కాపాడే 1500 ఏళ్ల నాటి ఆంజ‌న్న‌

ఆయ‌న క‌రుణ ఉంటే శతృశేషం నుంచి ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వంటారు. ఆయ‌న చ‌ల్ల‌ని చూపు మ‌న‌పై ప‌డితే జీవితం సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లుతుంది అనేది వాస్త‌వం. ఎందుకంటే త‌మిళ‌నాడు న‌మ‌క్కల్‌లోని ఆంజ‌నేయుడు కొన్ని వంద‌ల సంవత్స‌రాలుగా అక్క‌డి ప్ర‌జ‌ల సుఖ‌శాంతుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నాడు.

ర‌క్ష‌కుడు…
ఈ గుడి సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంటుంది. నరసింహ స్వామి ఆల‌యానికి సుమారు వంద మీటర్ల ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాల‌యంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. స్వామి విగ్రహం ఎత్తు 13 అడుగుల పైమాటే ఉంటుంది. ఆంజనేయుడి విగ్ర‌హం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా వుంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్క‌డి కోటకు రక్షకునిగా వుంటుంద‌ని , అక్కడి ప్రజలను శత్రువులనుండి రక్షిస్తుందని చెబుతారు స్థానికులు.

కోట పురాణం..
నామ‌గిరి కొండ‌ల‌పై ఉన్న న‌మ‌క్క‌ల్ కోట‌ను 16వ శ‌తాబ్దంలో రామ‌చంద్ర నాయ‌క‌ర్ నిర్మించారు. ఈ కోట‌లో ప్ర‌స్తుతం పురాత‌న‌మైన విష్ణు ఆల‌య శిథిలాలు కూడా ఉన్నాయి. నమక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ వుంటుంది. కోటకు నైరుతి భాగంలో మెట్లు కలవు. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహ‌లో నరసింహస్వామి, రంగనాథ స్వామి ఆల‌యాలు క‌ల‌వు. కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు కావటంతో నేటికి అవి చెక్కు చెదరకుండా వున్నాయి. ఈ కొండలలో ఎనిమిది పవిత్ర కొలనులు కలవు. వీటిలో తామర పూవులు పెరుగుతాయి. ఈ దుర్గం లో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకొన్నాడ‌ట‌. తర్వాతి కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నార‌ట‌. ఇక్కడి అద్భుమైన‌ శిల్పకళ ఈ ప్రదేశాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ సందర్శించే లా చేస్తాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి