NewsWaves.news

టైమ్స్ సర్వే రిపోర్ట్… ప్రజలంతా మోడీ సపోర్ట్

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోడీ ఇంటి ముఖం పట్టడం ఖాయమని ప్రతిపక్షాలు ఢంకా భజాయిస్తున్నాయి. కానీ ప్రజాక్షేత్రంలో మోడీ ప్రాభవం ఏ మాత్రం తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు అవుతుందని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారని టైమ్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది.

ఏకంగా 83 శాతానికి పైగా ప్రజలు మోడీ నాయకత్వానికి జై కొట్టారు. కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని 9 శాతానికి పైగా ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక 4 శాతం పైగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కానీ మోడీ ప్రధాని కారని విశ్వసిస్తున్నారు. ఈ ఓపీనియన్ పోల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని కావాలని 1.44 శాతం ప్రజలు కోరుకుంటున్నట్టుగా సర్వే నివేదికలో వెల్లడైంది.

Related Articles