NewsWaves.news

బోరు బావిలో ప‌డిన ఆరేళ్ల బాలుడు…

పూనేలో ఒక బోరుబావిలో అరేళ్ల బాలుడు జారిప‌డ్డాడు. ఆడుతూ వెళ్లిన చిన్నారి బోరు బావిని గ‌మ‌నించ‌కుండా అందులో ప‌డి పోయాడు. ఈ బోరుబావి సుమారు 200 అడుగులు ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పిల్లాడు 10 అడుగుల వద్ద ఉన్నాడ‌ని తెలుస్తోంది.

పూనేలోని అంబేగావ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న పోలీసులు, ఎన్‌డిఆర్ ఎఫ్ టీమ్ ఇప్ప‌టికే ఘ‌ట‌నా స్థలానికి చేరుకుంది..

ఈ ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Related Articles