NewsWaves.news

హ‌మ్మ‌య్య‌ : బోరు బావిలో ప‌డిన ఆరేళ్ల బాలుడు క్షేమం

20-02.19 -సాయంత్రం 4.45 నిమిషాలు

పూనేలో ఒక బోరుబావిలో అరేళ్ల బాలుడు జారిప‌డ్డాడు. ఆడుతూ వెళ్లిన చిన్నారి బోరు బావిని గ‌మ‌నించ‌కుండా అందులో ప‌డి పోయాడు. ఈ బోరుబావి సుమారు 200 అడుగులు ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పిల్లాడు 10 అడుగుల వద్ద ఉన్నాడ‌ని తెలుస్తోంది.

పూనేలోని అంబేగావ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న పోలీసులు, ఎన్‌డిఆర్ ఎఫ్ టీమ్ ఇప్ప‌టికే ఘ‌ట‌నా స్థలానికి చేరుకుంది..

21.2.19 ఉద‌యం

నిన్న పూనేలోని అంబేగావ్‌లో బోరుబావిలో ప‌డిన బాలుడు ర‌వి పండిత్ భిల్ (6) క్షేమంగా ఉన్నాడు. నిన్న సాయంత్రం 4.45 నిమిషాల‌కు బోరు బావిలో ప‌డిన రవిని ర‌క్షించ‌డానికి పోలీసులు, ఎన్‌డిఆర్ ఎఫ్ టీమ్ దాదాపు 16 గంటల పాటు శ్ర‌మించి బాలుడిని కాపాడ‌గ‌లిగింది.

రోడ్డు నిర్మాణ ప‌ని కోసం వ‌చ్చిన బాలుడి తండ్రి పిల్లాడు ఆడుకోవ‌డంతో త‌న ప‌నిలో ముగిగిపోయాడు. ఇంత లోనే పిల్లాడు బోరు బావిలో జారిపోయాడు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు హ‌టాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ర‌విని ర‌క్షించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసి విజ‌యం సాధించారు.

Related Articles