NewsWaves.news

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.. 69 మంది దుర్మరణం

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢాకాలోని చౌక్‌బజార్‌ అపార్ట్‌మెంట్‌లోని ఒక కెమికల్ గోదాములో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 56 మంది సజీవదహనమయ్యారు. 50 మందికిపైగా గాయాలయ్యాయి.

నిన్న రాత్రి 10.40 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సహాయక చర్యలు చేపట్టి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 50 మందికి పైగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.

Related Articles