NewsWaves.news

నమ్మకద్రోహానికి 5వ వార్షిక నిరసనలు… చంద్రబాబు

కేంద్రం..ఆంధ్రప్రదేశ్ కి నమ్మక ద్రోహం చేసి సరిగ్గా ఈనాటికి ఐదు సంవత్సరాలు అవుతుందని,ఈ సందర్భంగా 5వ వార్షిక నిరసనలు తెలియచేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.నేడు టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా విషయమే కాకుండా ఏపీకి ఇస్తానన్న మిగిలిన ఐదు హామీల విషయంలో కూడా బిజెపి మాట తప్పిందని..అలాంటి కేంద్ర నమ్మక ద్రోహాన్ని ఎండగట్టాలని ఆయన అన్నారు.

అంతే కాకుండా ఒక నేరస్తుడిని నాయకుడిగా చూపించేందుకు కొంతమంది సినీ నటులు ప్రయత్నాలు చేస్తున్నారని, సినీ హీరోలు నేరస్థుడిని వెళ్లి కలుస్తున్నారని,ఆ నేరస్తుడికి సరెండర్ అవుతున్నారని జగన్ ని ఉద్దేశించి బాబు వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు రక రకాల కుట్రలు, ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్, జగన్ కుట్రలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.

Related Articles