NewsWaves.news

జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిన్న కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఈ ముగ్గురు తీవ్రవాదులు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారే. కాగా ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ డీఎస్పీ, మరో జవాన్ మరణించారు. కుల్గామ్ లోని తురిగాం ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గా నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు, పోలీసులు తనిఖీలు ప్రారంభించారు

.ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అనంతరం భారత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో అమరుడైన డీఎస్పీ అమన్ ఠాకూర్ మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ సింగ్, డీజీపీ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

 

Related Articles