NewsWaves.news

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి…

చిత్తూరు జిల్లా నగరి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నగరి నుండి చెన్నైకి వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది.తిరుత్తని దారిలో రామకృష్ణ కాటన్ మిల్లు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా ఒక వాహనం వస్తుండగా దానిని తప్పించబోయి కారు బోల్తా పడటంతో ఈ సంఘటన జరిగింది.ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు నగరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండడంతో సెలవు ప్రకటించగా, వీరంతా కారులో విహారయాత్రకు బయలుదేరి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి