NewsWaves.news

రైలు ఢీ కొట్ట‌డంతో గొర్రెల కాప‌రితో సహా 170 గొర్రెలు మృతి

గుంటూరు- కర్నూల్ హైవే ద‌గ్గ‌ర‌లో దార‌ణం చోటు చేసుకుంది. గొర్రెల‌తో పాటు ప‌ట్టాలు దాటుతున్న గొర్రెల కాప‌రి.. రైలు ప‌ట్టాల నుంచి గొర్రెల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 170 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగం తిరుపతయ్య అనే గొర్రెల కాప‌రి గొర్రెలను తీసుకుని దారి గుండా నడుస్తూ వెళుతూ గురువారం జొన్నలగడ్డకు చేరుకున్నారు.

ఉదయం 8 గంటల సమయంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి గొర్రెల మందను తీసుకెళ్లారు. గొర్రెలన్నీ రైలు పట్టాల పైకి చేరిన సమయంలో రైలు దూసుకొచ్చించిది..వాటిని కాపాడుకునేందుకు తిరుపతయ్య కూడా పట్టాల పైకి వాటిని కిందకి తోలుతున్నాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి