సొంత ఊరిలో సీఎం సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగకు కొద్ది రోజులే ఉండడంతో… అప్పుడే పండుగ వాతావరణం మొదలైంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు వారి వారి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన స్వగ్రామం చేరుకొని సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు.

చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం 14వ తేదీన నారావారిపల్లెకు రానున్నారు. నారావారి కుటుంబం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను సొంత ఊరు అయినటువంటి నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు బాలకృష్ణ కుటుంబం కూడా ఈ రోజే నారావారిపల్లి చేరుకోనుంది.

Related Articles