బట్ట‌లు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు: కోదండ‌రాం

ఒక‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కులు న‌మ్మిన సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ఉండే వార‌ని.. ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని… బ‌ట్ట‌లు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నార‌ని తెలంగాణ‌ జ‌న‌స‌మితి పార్టీ అధ్య‌క్షులు కోదండ‌రాం. లోక్‌స‌భ ఎన్నిక‌లు, పొత్తుల‌పై, స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై మాట్లాడ‌టానికి ఆయన మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చ జరగలేదని తెలిపారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి కూట‌మిగా ఏర్ప‌డాలా లేదా అనే విష‌యంపై చర్చ జ‌ర‌గ‌లేదు అన్నారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆరునూరైనా కాంగ్రెస్ పార్టీతో క‌ల‌వ‌ద‌ని చెప్పారు.

Related Articles