NewsWaves.news

బట్టర్ చికెన్

నాన్ వెజ్ అనగానే అందరు ఎక్కువగా ఇష్టపడేది చికెన్ . ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఏదయినా స్పెషల్ గ చేయాలని అనుకుంటాం.చికెన్ లో చాలరకాల కర్రీస్ చేస్తారు.చికెన్ లో కాస్త కొత్తగా టేస్టీ గ కర్రీ చేయాలనుకుంటున్నారా మారె ఇంకెందుకు ఆలస్యం సూపర్ టేస్ట్ వుండే బట్టర్ చికెన్ ఎలా తయారుచేయాలో చూసేద్దాం .
కావలసిన పదార్ధాలు :
1.చికెన బ్రెస్ట్ పీస్

  1. ఉప్పు
  2. కారం
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్
  4. ధనియల పొడి 2 స్పూన్లు
  5. జీలకర్ర పొడి 2 స్పూన్లు
  6. పచ్చి కోవా
  7. బట్టర్
  8. కసూరి మేతి 2 స్పూన్లు
  9. కోరియండర్ పౌడర్ 2 స్పూన్లు
  10. టమాటో ప్యూరీ ఒక కప్
  11. ఫ్రెష్ క్రీం
  12. పెరుగు ఒక హాఫ్ కప్
    14.కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్
  13. బ్రౌన్ ఆనియన్ పొడి

తయారుచేసే విధానం :మీదుగా చికెన్ ను బాగా కడిగి అందులో కొద్దిగా పెరుగు ,ఉప్పు,కారం వేసి బాగా కలిపి 3లేదా 4 గంటల పటు నాననివ్వాలి . తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడినతర్వాత ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి అందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసి రెండువైపులా బాగా వేగనివ్వాలి స్టవ్ కాస్త సింమ్ లో పెట్టి 15 నిమిషాలపాటు మూతపెట్టి అలాగే ఉంచాలి . అప్పుడు చికెన్ బాగా సాఫ్ట్ గ ఉంటుంది. ఈ లోపు గ్రేవీ రెడీ చేసుకుందాం .ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియల పొడి , జీలకర్ర పొడి , కసురిమేతి ,కోరియండర్ పొడి ,బ్రౌన్ ఆనియన్ పొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి . పాన్ పెట్టి వేడియినా తర్వాత ఒక స్పూన్ బట్టర్ వేసి తర్వాత అందికో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ను అందులో వేసి బాగా 5 నిమిషాల పటు వేగనివ్వాలి తర్వాత పచ్చి కోవా వేసుకుని 2 నిమిషాలతర్వాత టొమాటొ ప్యూరీ కూడా వేసి బాగా వేగినతర్వాత 15 నిమిషాలపాటు మూతపెట్టి ఉడకనివ్వాలి . ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి క్లైపి అందులో కొద్దిగా ఫ్రెష్ క్రీం కూడా వేసి కలిపి 2 నిమిషాలపాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే … టేస్టీ టేస్టీ బట్టర్ చికెన్ రెడీ …


Related Articles