పీఎం మోడీ… సూపర్ సెల్ఫీ ఇది

సెల్ఫీకి ఉన్న క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సెల్ఫీలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు చాలా కామన్. కానీ ఇప్పుడు చెప్పబోయే సెల్ఫీ మాత్రం చాలా స్పెషల్. అది ఏంటి అంటే…బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు తాజాగా ప్రధానమంత్రి మోదీని కలిశారు. సినీ పరిశ్రమ అనేది చాలా పెద్దది.

అంత పెద్ద పరిశ్రమ అన్నాక దానికి తగ్గట్టే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ రేట్లు అలాగే సినీ ఇండస్ట్రీలో మౌలిక వసతులు ఏర్పాటు వంటి సమస్యలను తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రధాని మోదీ ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది.

మోదీ ఆ సమస్యలను పరిష్కరించారు. దానితో మోదీకి కృతజ్ఞతలు తెలియచేసేందుకు బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ప్రధానిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా స్టార్స్ అంతా మోడీతో ఒక సెల్ఫీ దిగి, దాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

Related Articles