పవన్ ప్రజాసేవ కోసం మాత్రమే వచ్చారు…మధు

రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు జనసేన తో కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. విశాఖలో మీడియాతో మాట్లాడిన మధు…ఏపీలో ప్రజలు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, తమ కూటమి ద్వారా రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఏయే స్థానాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేయనున్నారు… అనే విషయాన్ని ఈ నెల 18,19,20 తేదీలలో చర్చించనున్నామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు మధు.

ఇక అగ్రవర్ణ పేదలకు బిజెపి ప్రభుత్వం ఈబీసీ చట్టం కల్పించే విషయంపై స్పందించిన మధు… తాజాగా జరిగిన ఎన్నికల్లో దేశంలో ఉన్న దళితులంతా బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారని, అందుకే కనీసం అగ్రవర్ణాల ఓట్లు అయినా తాము దక్కించుకోవాలనే వ్యూహంతోనే మోడీ ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.

Related Articles