నేటి నుండి ఐబీపీఎస్ అడ్మిట్ కార్డు…

ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేటి నుండి హాల్ టికెట్ లను జారీ చేయనుంది ఐబీపీఎస్. డిసెంబరు 8, 9, 15,16 తేదీల్లో జరగున్న ప్రిలిమినరీ రాత పరీక్షలకు అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ నేడు విడుదల చేసింది. డిసెంబరులో ప్రిలిమినరీ రాతపరీక్షలను, వచ్చే ఏడాది జనవరి 20న మెయిన్స్ నిర్వహిస్తామని ఐబీపీఎస్ తన నోఫిఫికేషన్ లో ప్రకటించింది. ఏప్రిల్ నెలలోపు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 7,275 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్; పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేది వివరాలు ఇచ్చి వెబ్ సైట్ నుండి కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Related Articles