NewsWaves.news

నాది రైట్ టర్న్..అమిత్ షా ది రాంగ్ టర్న్.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ధర్మ పోరాట దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఆ లేఖ కి కౌంటర్ ఇచ్చారు.

తనది రైట్ టర్న్ అని, అమిత్ షాది రాంగ్ టర్న్ అని,హోదా విషయంలో బిజెపి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వీరంతా భయంకరమైన వ్యక్తులు అంటూ బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. నీతి ఆయోగ్ ఈ విషయాన్ని చెప్పిందంటూ అబద్ధాలు చెప్పారని చంద్రబాబు ఆరోపించారు.మోడీ అలాగే ఆయన బ్యాచ్ తప్ప అన్ని పార్టీల నేతలు ఈ దీక్షకు సంఘీభావం తెలపడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

Related Articles