త్రివిక్రమ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన వెంకటేష్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్– 2 చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా వెంకటేష్ చాలా విషయాలపై మాట్లాడారు.

ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు వెంకీ.ఇంతకాలం సినిమాలు తగ్గించడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ…నచ్చిన పాత్రలు, కథలు రావట్లేదని, అందుకే తక్కువగా సినిమాలు చేస్తున్నానని అన్నారు వెంకీ.

ఇక త్రివిక్రమ్ తో సినిమా గురించి అడగ్గా…ఆయనతో సినిమా ఆగిపోలేదని, కేవలం కథ కోసమే వెయిట్ చేస్తున్నామని,త్రివిక్రమ్ తన కోసం ఒక మంచి కథను తీసుకొస్తాడనే నమ్మకం తనకు ఉందని వివరించారు వెంకటేష్.

Related Articles