తెలుగు మీడియం అని భ‌య‌ప‌డ‌కు..!

ఇంగ్లిష్‌ మీడియం లో చ‌దివే వారికే జేఈఈ వంటి వాటిలో ఎక్కువ పాస్‌లు, స్కోరింగ్‌లుంటాయ‌ని చాలా మంది భ్ర‌మ ప‌డుతుంటారు. నిజానికి ఏ మీడియంలో చ‌దువుతున్నా కాంపిటేటివ్ ప‌రీక్ష‌ల‌ను ఎలాంటి జంకూ లేకుండా ఎదుర్కోవ‌చ్చంటున్నారు విద్యాకౌంస‌ల‌ర్లు, విద్యావేత్త‌లు. ఎందరో విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు మీడియంలో +2 చదివి, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సాధించిన వారున్నారు. .

అన్నిర‌కాల కాంపిటేటివ్ ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ, పరీక్ష ఉద్దేశం విద్యార్థికి సబ్జెక్టుపై ఎంత పట్టు ఉందో ప‌రిశీలించుకోవ‌డ‌మే ముఖ్యం. అయితే పరీక్షకు సిద్ద‌ప‌డేట‌ప్పుడు మాత్రం ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల పుస్తకాలనూ పక్కన పెట్టుకోవాలి.
ఏ మీడియంలో చ‌దువుతున్నా.. చ‌దివినా .. సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే ఫ‌లితం త‌ప్ప‌క ఉంటుంది. ఇంగ్లీష్ ప్రావిణ్య‌త పూర్తిగా ఆంండ‌న‌వ‌స‌రంలేదు. తెలుగు విద్యార్ధులుకూడా ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానంతో విజయాన్ని సాధించొచ్చు.

Related Articles