గుడ్డును తెగ తింటున్న తెలంగాణా….

కోడిగుడ్లను తినడం లో తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఈ విషయాన్ని నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ నివేదిక వెల్లడించింది.మొత్తం దేశ వ్యాప్తంగా ఒక రోజుకు 22కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతుంటే, అందులో తెలంగాణ 3.2 కోట్లు వినియోగిస్తుందని నివేదిక తెలియజేసింది.

రాష్ట్రంలో తలసరి కోడిగుడ్ల వినియోగం సంవత్సరానికి 180 అని వెల్లడించిన నివేదిక… ఇది జాతీయ పౌష్టికాహార సంస్థ తెలిపినటువంటి తలసరి వినియోగానికి సమానం అని వివరించింది.రోజుకు 1.7 కోట్ల కోడిగుడ్లను తెలంగాణ ఉపయోగిస్తుండగా అందులో 55 లక్షల కోట్లు కేవలం హైదరాబాద్ జనాలే తినడం విశేషం. గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా ఉందట.

ఇక పక్క రాష్ట్రమైన ఏపీలో తలసరి గుడ్ల వినియోగం 119 మాత్రమే అని తెలిపింది నివేదిక.తెలంగాణ తరువాత రెండవ స్థానంలో తమిళనాడు 123 కోడిగుడ్ల తలసరి వినియోగంతో ఉండగా,మూడో స్థానంలో ఏపీ,4వ స్థానంలో కర్ణాటక, ఐదవ స్థానంలో కేరళ, ఆరవ స్థానంలో మహారాష్ట్ర, ఏడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, ఎనిమిదవ స్థానంలో ఒడిశా, 9వ స్థానంలో చత్తీస్ గడ్ నిలవగా ఎల్..ఇక తలసరి 12 కోడిగుడ్ల వినియోగంతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది.

Related Articles