ఇది మోడీ ఎన్నికల జిమ్మిక్కు…. మంత్రి యనమల రామకృష్ణుడు

మిత్ర పక్షాల నమ్మకాన్ని ప్రధాని మోదీ ఎప్పుడో కోల్పోయారని, అందుకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బయటకు వెళ్లి పోయాయని, ఇప్పుడు మళ్లీ పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాయని మోడీ ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

అమరావతి లో మాట్లాడిన యనమల.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ సర్కారు తెచ్చిన బిల్లు ఎన్నికల జిమ్మిక్ అని, మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లు, తెలంగాణ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ బిల్లు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మోడీ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.

దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేని మోడీ, ఆగమేఘాలమీద ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టడం దేనికి సంకేతమని యనమల ప్రశ్నించారు.

Related Articles