ఇండియన్‌ కోస్టు గార్డులో.. ఉన్న‌త ఉద్యోగం పొంద‌డం ఎలా..?

పోలీస్ డిపార్ట్ మెంట్‌లో ఏసీపీ ,డీఎస్పీ స్థాయి హోదా ఉద్యోగాలు భార‌త కోస్ట్‌గార్డ్ నావికా సంస్థ‌లోకూడా పొందే వీలు ఐసీజీ క‌ల్పిస్తూ‘అసిస్టెంట్‌ కమాండెంట్‌’ ఉద్యోగానికి యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు.
.
ఎంపికైనవారిని నేవల్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. సీనియర్‌ అధికారుల, నావికుల నేతృత్వంలో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాల్సిఉంటుంది.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపికలు చేపడతారు. స్టేజ్‌ -1 పరీక్ష లో మెంటల్‌ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీ అండ్‌ డీటీ) ఉంటాయి.
.
ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి. ఇందులో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి వ్యాఖ్యానించమంటారు. స్టేజ్‌ -1లో ఎంపికైనవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు.ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు మే, 2019లో కోస్టు గార్డు వెబ్‌ సైట్‌లో ప్రకటిస్తారు. వీరికి జూన్‌ ఆఖరు నుంచి ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ (ఐఎన్‌ఏ), ఎజిమలలో శిక్షణ ప్రారంభమవుతుంది.
.

అసిస్టెంట్‌ కమాండెంట్ ఉద్యోగ అర్హ‌త‌లు

1 జనరల్‌ డ్యూటీ (పురుషులు) 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. 01.07.1994 – 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.
.
2 జనరల్‌ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) మహిళలు
కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. . ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను చదివి ఉండాలి. 3 కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (ఎస్‌ఎస్‌ఏ) పురుషులు/ మహిళలు
.
మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో పన్నెండో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. అభ్యర్థులు 01.07.1994 – 30.06.2000 మధ్య జన్మించి ఉండాలి.
.
4 లా- పురుషులు/ మహిళలు
.
కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ (లా) ఉత్తీర్ణులైవుండాలి. అభ్యర్థులు 01.07.1989 – 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి. అసిస్టెంట్‌ కమాండెంట్‌ జనరల్‌ డ్యూటీ, లా విభాగాలకు పురుషులు 157, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే అన్నింటినీ రద్దు చేస్తారు.

Related Articles