అత్మ‌హ‌త్యాయ‌త్నం నుంచి ఆసుప‌త్రిలో పెళ్లిదాకా…

శుభ‌కార్యం జ‌ర‌గాల్సి ఉంటే ఎవ్వ‌రూ ఆప‌లేరు. ఇదే విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయింది. ఒక ప్రేమ జంట‌. ఆ జంట పెళ్లి చేసుకుందామ‌ని పెద్ద‌ల‌ను అనుమ‌తి కోరితే… అస్స‌లు కుద‌రదు అన్నారు. ఒక్క‌టిగా ఉండ‌లేన‌ప్పుడు.. బ‌త‌క‌డం ఎందుకు అనుకున్నారు. వెంట‌నే ఆ జంట ఆత్మ‌హ‌త్యాయత్నం చేసింది. కానీ అక్క‌డే క‌థ కొత్త మ‌లుపు తీసుకుంది.

వికారాబాద్ అత్వెల్లికి చెందిన అమ్మాయి.. ధారూర్ , కుక్కింద గ్రామానికి చెందిన అబ్బాయి గత కొంతకాలంపాటు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయ‌త్నం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న బంధువులు అటువైపు వాళ్ల‌ను.. ఇటువైపు వాళ్ల‌ను ఒప్పించి మ‌రీ ఆసుపత్రిలోనే వీరికి పెళ్లి చేశారు. అమ్మాయి పరిస్థితి విషమం కాగా.. అబ్బాయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Related Articles