NewsWaves.news

ప్రముఖులతో టీడీపీ భారీ బహిరంగ సభ….

ఈనెల 31వ తేదీన తెలుగుదేశం పార్టీ విశాఖ పట్టణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు జాతీయ నేతలు హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో పాటు మరి కొంతమంది ప్రముఖ జాతీయ నేతలు కూడా ఈ సభకు హాజరుకానున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి అన్ని ప్రధాన పార్టీల తరపున ప్రముఖులు బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎం వి.వి.ఎస్.మూర్తి మనుమడు అయిన శ్రీ భరత్ పోటీ చేయనుండగా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సత్యనారాయణ, ఇక జనసేన నుండి జె.డి.లక్ష్మీనారాయణ, బిజెపి తరఫున పురంధరేశ్వరి బరిలోకి దిగారు.ఈ నేపథ్యంలో టిడిపి ఏర్పాటుచేయనున్న భారీ బహిరంగ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *