NewsWaves.news

జైళ్ళ చుట్టూ తిరిగే జగన్ కు కుటుంబ బాంధవ్యాలు ఏమి తెలుసు…నారా రోహిత్

హీరో నారా రోహిత్ వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సామాజిక మాధ్యమాలలో తన తండ్రి రామ్మూర్తి అలాగే పెదనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రసారమవుతున్న కథనాలపై నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి అలాగే పెదనాన్న ఇద్దరూ కూడా రామలక్ష్మణులలాగా కలిసి ఉన్నారని, అంత బాగా ఉన్న వాళ్ళ మధ్య గొడవలు ఉన్నట్లుగా సృష్టించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.

సొంత బాబాయి మీదే చెయ్యి చేసుకున్న చరిత్ర జగన్ ది అని విరుచుకుపడ్డారు నారా రోహిత్. కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరిగే జగన్ కు కుటుంబ సంబంధాల గురించి ఏం తెలుస్తుంది అన్నారు. ఇక పెదనాన్న చంద్రబాబు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని,మాకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతని ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు అని స్పష్టం చేశారు నారా రోహిత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *