NewsWaves.news

శ్రీలంక మాజీ అధ్యక్షున్ని కలిసిన పాల్

శ్రీలంక లో జరిగిన మారణహోమం లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ ఐయస్ఐయస్ఐ ఉగ్రవాద సంస్థ దారుణకాండ కి పాల్పడింది.

ప్రస్తుతం పాల్ శ్రీలంకలో ఉన్నారు. అక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన ఉగ్రవాదుల దాడులతో అక్కడ శాంతి నెలకొనేందుకు తన వంతు ప్రయత్నం చేయడానికి పాల్ శ్రీలంక వెళ్లారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహంద్ర రాజ పక్సేతో కలిసి టీ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ పక్సేకు పాల్ స్నేహితుడు. గతంలో సునామి వచ్చినప్పుడు శ్రీలంకకు తన అంతర్జాతీయ చారిటీ సంస్థ ద్వారా భారీగా సాయం అందించారు. చేసిన సాయాన్ని రాజపక్సే గుర్తుంచుకున్నారు.

పాల్ మాట్లాడుతూ శ్రీలంకలో 400 మంది చనిపోయారని, సుమారు వెయ్యి మంది గాయపడ్డారని, కొన్ని వందలమంది ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఇక్కడ పేస్ బుక్ లేదని, అందుకనే విద్యార్థులకు మెసేజ్ పంపలేకపోయానని అన్నారు. మిమ్మల్ని మీరు చంపుకోవద్దని, దేవుడు మీయందు ఉన్నాడని పాల్ అన్నారు.పాల్ శ్రీలంకలో ఉన్నప్పటికీ తెలంగాణలోచోటు చేసుకుంటున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన స్పందించారు విద్యార్థులు మనోస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *