NewsWaves.news

పవన్ ను కలిసిన గబ్బర్ సింగ్ బ్యాచ్…

ఎన్నికలకు మరి కొద్ది రోజులే ఉండడంతో ఏపీ లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పవన్ తరపున పవన్ అభిమానులు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరితో అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా పవన్ తరఫున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రోజు గబ్బర్ సింగ్ బ్యాచ్ మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేనానిని కలిసారు. ఎన్నికల ప్రచారం గురించి రాజకీయ విషయాల గురించి పవన్ తో చర్చించారు. పవన్ తో వీరంతా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *