NewsWaves.news

క‌ప్పు కాఫీ…రోజంతా హ్యాపీ !


వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి  కాఫీ తాగితే  ఆ మజాయే వేరు.  చాలామంది  కాఫీ అంటే ఇష్ట‌ప‌డ‌తారు.  బుర్ర వేడెక్కిన‌ప్పుడు, భ‌రించ‌లేని త‌ల‌నొప్ప‌తో బాధ‌ప‌డుతుంటే రిలీఫ్ కోసం కాఫీ తాగుతారు.  నీర‌సంగా, డ‌ల్ గా ఉన్న‌ట్లు అనిపిస్తే కప్పు కాఫీ తాగితే చాలు చురుగ్గా పనిచేయ‌గ‌లుగుతారు. ఉత్సాహం వ‌స్తుంది. మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Benefits of Coffee

* వయసు పైబ‌డుతున్నవారిలో  డెమెన్షియా, అల్జీమర్స్ వంటి స‌మ‌స్య‌లు స‌హ‌జం. ఒక క‌ప్పు కాఫీ తాగితే ఇలాంటివి ద‌రిచేర‌వు.   డయాబిటిస్ ఉన్న వారు చక్కెర లేకుండా కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలి. వారి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అందువ‌ల్ల‌   మధుమేహం అదుపులో ఉంటుంది.  మ‌ధుమేహాన్ని అదుపు చేసే గుణాలు కాఫీలో ఉన్నాయి. .

*ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. నేత్ర సమస్యలు పోతాయి. దృష్టి బాగా ఉంటుంది.

*  కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి  రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.  క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణతులు పెరగకుండా చూస్తాయి. కప్పు కాఫీ తాగితే చాలా సేపటి వరకు ఆకలి వేయదు. బరువు తగ్గ‌డానికి ఆస్కారం ఉంటుంది.

*కాఫీ తాగితే  రక్త ప్రసరణ మెరుగ‌వుతుంది. గుండె సంబంధిత‌ వ్యాధులు  ద‌రి చేర‌వు.  శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న వారు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే  చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *